కేస్లాపూర్ సర్పంచ్ తండ్రికి నివాళులర్పించి కుటుంబాన్ని ఓదార్చిన ఎమ్మెల్యే బొజ్జు
రిపోర్టర్: Alfa News Desk
స్థలం: ఇంద్రవెల్లి
ఇంద్రవెల్లి మండలం కేస్లాపూర్ గ్రామ సర్పంచ్ మెస్రం తుకారాం తండ్రి శేకు పటేల్ మృతి చెందడంతో, ఖానాపూర్ శాసనసభ్యులు వెడ్మ బొజ్జు పటేల్ కేస్లాపూర్ గ్రామానికి స్వయంగా చేరుకుని వారి పార్థివ దేహానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులు అర్పించారు. అనంతరం శోకసంద్రంలో ఉన్న కుటుంబ సభ్యులను ఓదార్చి తన ప్రగాఢ సానుభూతిని తెలియజేసి ధైర్యం చెప్పారు.