ప్రజా సేవల్లో విప్లవం: వాట్సాప్ ద్వారానే కుల ధృవీకరణ పత్రం డౌన్లోడ్
రిపోర్టర్: వెంకట్
స్థలం: అమరావతి
ప్రజా సేవలను మరింత వేగవంతం చేసే దిశగా ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం మనమిత్ర వాట్సాప్ గవర్నెన్స్ ద్వారా కీలక సేవలను అందుబాటులోకి తెచ్చిందని అధికారులు తెలిపారు. ఇకపై సచివాలయాల చుట్టూ తిరిగే పనిలేకుండా నేరుగా వాట్సాప్ ద్వారానే కుల ధృవీకరణ పత్రం సులభంగా డౌన్లోడ్ చేసుకునే వీలు కల్పించారు. దీనికోసం అధికారిక నంబర్‌కు సందేశం పంపి తక్కువ రుసుముతో ఈ సేవలను పొందవచ్చని పేర్కొన్నారు.