పుణెలో పింక్ మెట్రో ప్రారంభం: దేశంలోనే తొలిసారిగా పూర్తిగా మహిళా ఆపరేటర్ల నిర్వహణ
రిపోర్టర్: రాజేష్
స్థలం: పుణె
మహారాష్ట్రలోని పుణెలో రూ.8,300 కోట్ల వ్యయంతో నిర్మించిన మెట్రో లైన్-3 ను ప్రధాని నరేంద్ర మోదీ మంగళవారం వర్చువల్గా ప్రారంభించనున్నారు అని అధికారులు తెలిపారు. మాణ్ నుంచి డిస్ట్రిక్ట్ కోర్టు మెట్రో స్టేషన్ వరకు నిర్మించిన ఈ 23 కిలోమీటర్ల పింక్ లైన్ను పూర్తిగా మహిళా ఆపరేటర్లే నిర్వహించనున్నారు. ఇది దేశంలోనే మొదటిదని కేంద్ర ప్రభుత్వం పేర్కొంది. అలాగే రూ.13,500 కోట్ల అంచనా వ్యయంతో పుణె మెట్రో ఫేజ్-2 పనులకు కూడా ఆయన శంకుస్థాపన చేయనున్నారు.