అరుదైన ఈగిల్ గుడ్లగూబ గుర్తింపు: తూర్పు హిమాలయాల్ లో తొలిసారిగా కెమెరాకు చిక్కిన వైనం
రిపోర్టర్: ప్రసాద్
స్థలం: Kolkata
పశ్చిమ బెంగాల్ లోని బుక్సా టైగర్ రిజర్వ్ సమీపంలో అత్యంత అరుదైన యురేషియన్ ఈగిల్ గుడ్లగూబను పక్షుల పరిశీలకులు తొలిసారిగా ఫోటో తీసినట్లు పక్షుల నిపుణులు తెలిపారు. పశ్చిమ హిమాలయాల్ లో సాధారణంగా కనిపించే ఈ భారీ జాతి గుడ్లగూబ తూర్పు భారతదేశంలో కనిపించడం ఇదే మొదటిసారని శాస్త్రవేత్తలు వెల్లడించారు. భూటాన్ లో ఇటీవల సంభవించిన వాతావరణ మార్పులు లేదా వరదల కారణంగా ఇది ఈ ప్రాంతానికి వలస వచ్చి ఉంటుందని నిపుణులు భావిస్తున్నారు.