సౌకర్యాలు లేక కుదేలవుతున్న జన్నారం ప్రభుత్వ ఆసుపత్రి బతుకు

రిపోర్టర్: Gangadhar Reporter స్థలం: జన్నారం

మంచిర్యాల జిల్లా జన్నారం ప్రభుత్వ ఆసుపత్రిలో కనీస సౌకర్యాల కొరతతో ప్రజలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. ఆసుపత్రిని ముప్పై పడకలకు అప్గ్రేడ్ చేస్తామని అధికారులు, ప్రజాప్రతినిధులు పలుమార్లు హామీలు ఇచ్చినప్పటికీ నేటికీ అమలుకు నోచుకోలేదు. ఇరవై తొమ్మిది గ్రామపంచాయతీల నుంచి రోజూ వందలాది మంది వైద్యం కోసం వస్తున్నప్పటికీ, సీజనల్ వ్యాధుల సమయంలో తగిన వైద్య సదుపాయాలు లభించక రోగులు అవస్థలు పడుతున్నారని స్థానికులు తీవ్ర ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.