రైల్వే ఉద్యోగం పేరుతో రూ.24 లక్షలు టోకరా

రిపోర్టర్: రాజేష్ స్థలం: విజయనగరం

విజయనగరం జిల్లా వేపాడ మండలం పెదకృష్ణరాజపురంలో రైల్వే టీటీఈ ఉద్యోగం ఇప్పిస్తామంటూ రూ.24.08 లక్షలు వసూలు చేసి మోసం చేసిన ఇద్దరిపై వల్లంపూడి పోలీసులు కేసు నమోదు చేశారు. బాధితుడి ఫిర్యాదు మేరకు నిందితులు ఎం.చిట్ట సత్య గౌరీశంకర్, జె.సతీష్‌పై చీటింగ్ కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.