తెలంగాణలో బీసీ సీఎం ఖాయమంటూ పీసీసీ చీఫ్ మహేష్ గౌడ్ ప్రకటన
రిపోర్టర్: అశోక్
స్థలం: హైదరాబాద్
భవిష్యత్తులో తెలంగాణకు బీసీ నేత ముఖ్యమంత్రి కావడం ఖాయమని టీపీసీసీ అధ్యక్షుడు మహేష్ కుమార్ గౌడ్ స్పష్టం చేశారు. ఈ ప్రతిపాదనకు కాంగ్రెస్ అగ్రనేతలు రాహుల్ గాంధీ, మల్లికార్జున ఖర్గేతో పాటు స్వయంగా సీఎం రేవంత్ రెడ్డి కూడా మద్దతు ఇస్తారని ఆయన పేర్కొన్నారు. అధికార పార్టీలో జరిగిన ఈ పరిణామం రాష్ట్ర రాజకీయాల్లో తీవ్ర చర్చకు దారితీసింది. కాంగ్రెస్ పార్టీలో సాగుతున్న ఈ పవర్ పాలిటిక్స్ ఇప్పుడు సర్వత్ర ఆసక్తికరంగా మారాయి.