ఆరు గ్యారెంటీలను పూర్తిస్థాయిలో అమలు చేయాలని సీపీఐ డిమాండ్
రిపోర్టర్: ఆముదాల వెంకన్న
స్థలం: ఖమ్మం అర్బన్
కాంగ్రెస్ ప్రభుత్వం ఎన్నికల్లో ఇచ్చిన ఆరు గ్యారెంటీలను పూర్తిస్థాయిలో అమలు చేయాలని సీపీఐ బోనకల్లు మండల కార్యదర్శి యంగల ఆనందరావు డిమాండ్ చేశారు. గోవిందాపురం ఎల్లో జరిగిన సమావేశంలో మాట్లాడిన ఆయన మహిళలకు నగదు బదిలీ, రైతు భరోసా, యువ వికాసం హామీలను వెంటనే అమలు చేయడంతో పాటు అర్హులైన నిరుపేదలందరికీ ఇందిరమ్మ ఇళ్లు మంజూరు చేయాలని ప్రభుత్వాన్ని కోరారు.