జవహర్నగర్ డంప్యార్డు సమస్యపై ఎంపీ ఈటల రాజేందర్ పాదయాత్ర ప్రకటన

రిపోర్టర్: రాజేష్ స్థలం: మేడ్చల్ మల్కాజ్‌గిరి

జవహర్నగర్ డంప్యార్డు సమస్యపై ఎంపీ ఈటల రాజేందర్ సంచలన ప్రకటన చేశారని తెలిపారు. డంప్యార్డు నుండి వెలువడుతున్న మిథేన్ గ్యాస్ వల్ల స్థానిక ప్రజలు ఎదుర్కొంటున్న తీవ్ర అనారోగ్య సమస్యలను పరిష్కరించేందుకు ఈ నెల 27వ తేదీ నుండి ప్రత్యేక పాదయాత్ర చేపట్టనున్నట్లు ఆయన స్పష్టం చేశారు. బాధితుల గోడును పట్టించుకోని ప్రభుత్వ వైఖరిని తీవ్రంగా తప్పుబట్టారు.