దీపావళి వరకు దేశంలో నిరసనలు వాయిదా: కాక్రోచ్ జనతా పార్టీ ప్రకటన

రిపోర్టర్: రమేష్ స్థలం: న్యూఢిల్లీ

దీపావళి పండుగ ముగిసే వరకు దేశంలో ఎలాంటి నిరసన కార్యక్రమాలు చేపట్టబోమని కాక్రోచ్ జనతా పార్టీ వ్యవస్థాపకుడు అభిజీత్ దీప్కే ప్రకటించారు. కేంద్ర ఎన్నికల కమిషనర్ రాజీనామా డిమాండ్తో యువత ఉద్యమం చేస్తుండగా, కుటుంబాల ఆందోళన దృష్ట్యా తాత్కాలికంగా ఆందోళనలు వాయిదా వేస్తున్నట్లు తెలిపారు. జ్యుడిషియల్ కస్టడీలో పార్టీ నేతలు ఉన్నందున, పండుగ సమయంలో కుటుంబాలకు ఇబ్బంది కలగకూడదనే ఉద్దేశంతో ఈ నిర్ణయం తీసుకున్నట్లు ఆయన స్పష్టం చేశారు.