నెల్లూరు జిల్లాలో పరిషత్తు ఎన్నికల ఓట్ల లెక్కింపునకు సర్వం సిద్ధం
రిపోర్టర్: శివ
స్థలం: నెల్లూరు
నెల్లూరు జిల్లా వ్యాప్తంగా పరిషత్తు ఎన్నికల ఓట్ల లెక్కింపు ప్రక్రియకు అన్ని ఏర్పాట్లు పూర్తయ్యాయని జిల్లా అధికారులు తెలిపారు. శనివారం ఉదయం ఎనిమిది గంటల నుంచి ఆరు కేంద్రాల్ లో కౌంటింగ్ ప్రారంభం కానుందని పేర్కొన్నారు. దీనికోసం మూడు వందల యాభై రెండు టేబుళ్లను ఏర్పాటు చేసినట్లు వెల్లడించారు. ప్రతి రౌండ్ ఫలితాలను ప్రత్యేక యాప్ లో నమోదు చేసేందుకు పకడ్బందీ చర్యలు తీసుకున్నామని అధికారులు స్పష్టం చేశారు.