యూకే వీసా మోసం కేసులో యూట్యూబర్ నందన విచారణ
రిపోర్టర్: హరి
స్థలం: రంగారెడ్డి
యూకే వీసా మోసం కేసులో ఆరోపణలు ఎదుర్కొంటున్న యూట్యూబర్ నందన ఇబ్రహీంపట్నం పోలీసుల ఎదుట విచారణకు హాజరయ్యారు. విదేశాల్లో ఉద్యోగాలు, వీసాలు ఇప్పిస్తామంటూ రూ.13 లక్షలు వసూలు చేశారని క్రాంతి కుమార్ ఫిర్యాదు చేయడంతో పోలీసులు కేసు నమోదు చేశారు. సుమారు మూడు గంటల పాటు విచారించిన అధికారులు, ఈ నెల 16న మరోసారి హాజరుకావాలని నోటీసులు జారీ చేశారు. మరోవైపు ఈమె బిగ్ బాస్ వైల్డ్‌కార్డ్ ఎంట్రీ కోసమే వచ్చారనే ప్రచారం జరుగుతోంది.