విశాఖలో ముఖ్యమంత్రి పర్యటనకు భారీ భద్రత ఏర్పాటు
రిపోర్టర్: నరేష్
స్థలం: విశాఖపట్నం
విశాఖపట్నంలో ముఖ్యమంత్రి పర్యటన నేపథ్యంలో నగర పోలీసులు పటిష్ట భద్రతా ఏర్పాట్లు చేశారు. ఏయూ ఇంజనీరింగ్ కాలేజ్ గ్రౌండ్లో జరిగే సభకు విస్తృత భద్రత కల్పించడంతో పాటు డ్రోన్లతో నిఘా ఏర్పాటు చేశారు. నగరంలో బందోబస్తును స్వయంగా పరిశీలించిన సీపీ శంఖబ్రత బాగ్చీ, అధికారులకు తగు ఆదేశాలు జారీ చేశారు. నేటి అర్ధరాత్రి నుండి ట్రాఫిక్ ఆంక్షలు అమల్లోకి రానున్నాయి.