సాలూరులో కలకలం: తెదేపా అభ్యర్థులను జనసేన నేత బెదిరిస్తున్నారంటూ ఆడియో వైరల్

రిపోర్టర్: ప్రసాద్ స్థలం: సాలూరు

పార్వతీపురం మన్యం జిల్లా సాలూరు పురపాలికలో తెదేపా అభ్యర్థులను జనసేన నేత బెదిరిస్తున్నట్లు ఉన్న ఆడియో సామాజిక మాధ్యమాల్లో చక్కర్లు కొట్టి కలకలం రేపింది. మంత్రి సంధ్యారాణి మరియు తెదేపా కౌన్సిల్ అభ్యర్థులను ఉద్దేశించి జనసేన నేత మాధవరావు హెచ్చరికలు చేసినట్లు తెదేపా శ్రేణులు ఆరోపిస్తున్నాయి. ఈ ఘటనపై కూటమిలో తీవ్ర చర్చ నడుస్తుండగా, తన మాటలను వక్రీకరించారని మాధవరావు వివరణ ఇచ్చారు.