గంగమ్మ తల్లికి పట్టు వస్త్రాల సమర్పణపై సమీక్ష
రిపోర్టర్: katikapalli perumal
స్థలం: నగరి
చిత్తూరు జిల్లా నగరిలో గంగమ్మ తల్లికి బుధవారం నాడు పట్టు వస్త్రాల సమర్పణ కార్యక్రమంపై అధికారులతో సమీక్ష సమావేశం నిర్వహించారు. నగరి శాసనసభ్యులు గాలి భాను ప్రకాష్ స్వహస్తాలతో పట్టు వస్త్రాలు సమర్పించనున్నారు. ఈ వేడుకను ఘనంగా నిర్వహించేందుకు టీటీడీ కరియమానిక స్వామి ఆలయం నుండి గంగమ్మ ఆలయం వరకు మేళతాళాలతో మంగళవాయిద్యాల నడుమ సారే కార్యక్రమం చేపట్టనున్నారు. ఆలయ అధికారులు, అర్చకులు, ప్రజలు సమన్వయంతో ఈ వేడుకను విజయవంతం చేయాలని నిర్ణయించారు.