హైదరాబాద్లో షాకింగ్ ఘటన: సీజ్ చేసిన ఫోన్, బంగారంతో ఉడాయించిన కానిస్టేబుల్
రిపోర్టర్: భాస్కర్
స్థలం: Hyderabad
హైదరాబాద్లోని మీర్పేట పోలీస్ స్టేషన్లో పనిచేస్తున్న కానిస్టేబుల్ శ్రవణ్ కుమార్ దర్యాప్తులో భాగంగా సీజ్ చేసిన మొబైల్ ఫోన్ ద్వారా ఆన్లైన్లో సుమారు లక్షా డెబ్బై వేల రూపాయలను తన బంధువుల ఖాతాలకు బదిలీ చేసినట్లు అధికారులు తెలిపారు. అదే కేసులో స్వాధీనం చేసుకున్న పన్నెండు తులాల బంగారు ఆభరణాలను కూడా ఆయన తాకట్టు పెట్టినట్లు విచారణలో వెల్లడైందని, ఈ వ్యవహారంలో ఆయనపై కేసు నమోదు చేసి రిమాండ్కు తరలించినట్లు పోలీసులు వెల్లడించారు.