అన్నదాతల ఆక్రోశం: వరి సాగుకు సెల్ఫ్ డిక్లరేషన్ నిబంధన తెచ్చిన సర్కార్

రిపోర్టర్: సురేష్ స్థలం: హైదరాబాద్

యాసంగిలో వరి సాగును పూర్తిగా నియంత్రించే లక్ష్యంతో రేవంత్ రెడ్డి ప్రభుత్వం వ్యవసాయ రంగంలో వివాదాస్పద నిబంధన తెచ్చిందని నమస్తే తెలంగాణ నివేదించింది. పంట నష్టానికి ప్రభుత్వానికి ఎలాంటి బాధ్యత లేదని రైతుల చేత స్వీయ అంగీకార పత్రం రాయించుకుంటున్నారని విమర్శలు వస్తున్నాయి. విత్తనాల కొనుగోలుకు సెల్ఫ్ డిక్లరేషన్ తప్పనిసరి చేయడంతో అన్నదాతలు తీవ్ర ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.