నేషనల్ మెడికల్ కమిషన్ ఎంబీబీఎస్ సీట్ల జాబితా విడుదల
రిపోర్టర్: సతీష్
స్థలం: భారతదేశం
నేషనల్ మెడికల్ కమిషన్ 2026-27 విద్యా సంవత్సరానికి సంబంధించి ఎంబీబీఎస్ సీట్ల తాజా మ్యాట్రిక్స్ ను విడుదల చేసింది. దేశవ్యాప్తంగా 839 వైద్య కళాశాలల్లో మొత్తం 1,40,664 ఎంబీబీఎస్ సీట్లను కేటాయించినట్లు ఎన్ఎంసీ వెల్లడించింది. ఇందులో ప్రభుత్వ వైద్య కళాశాలల్లో 64,121 సీట్లు, ప్రైవేట్ కళాశాలల్లో 76,543 సీట్లు అందుబాటులో ఉన్నాయి. అనుమతించిన సీట్ల కంటే అదనంగా ప్రవేశాలు కల్పిస్తే కఠిన చర్యలు ఉంటాయని కళాశాలలను ఎన్ఎంసీ హెచ్చరించింది.