అరేబియా సముద్రంలో భారత, పాకిస్థాన్ యుద్ధనౌకల ఢీ
రిపోర్టర్: నరేష్
స్థలం: India
ఉత్తర అరేబియా సముద్రంలో అంతర్జాతీయ జలాల్లో గస్తీ నిర్వహిస్తున్న భారత నావికాదళ యుద్ధనౌకను పాకిస్థాన్ నేవీ నౌక అతివేగంగా వచ్చి ఢీకొట్టింది. ఈ ఘటనపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసిన భారత విదేశాంగ శాఖ, న్యూఢిల్లీలోని పాక్ దౌత్యవేత్తకు అత్యవసర సమన్లు జారీ చేసింది. పాక్ నౌకల అజాగ్రత్త చర్యను ఖండిస్తూ గట్టి హెచ్చరికలు జారీ చేసింది.