జగిత్యాల జిల్లాలో గణేష్ నిమజ్జనోత్సవ ఏర్పాట్లను పరిశీలించిన ఎస్పీ జగిత్యాల

రిపోర్టర్: మహేష్ స్థలం: జగిత్యాల

జగిత్యాల జిల్లాలో గణేష్ నిమజ్జనోత్సవాలు రెండవ రోజు ప్రశాంతంగా కొనసాగుతున్నాయి. కోరుట్ల పట్టణంలోని ఇమ్మర్షన్ పాయింట్ వద్ద భద్రతా ఏర్పాట్లను ఎస్పీ జగిత్యాల స్వయంగా పరిశీలించారు. రద్దీ ప్రాంతాల్లో పరిస్థితులను పర్యవేక్షిస్తూ, అవాంఛనీయ ఘటనలు తలెత్తకుండా అప్రమత్తంగా ఉండాలని పోలీస్ అధికారులను ఆయన ఆదేశించారు. శోభాయాత్ర మార్గాల్లో పటిష్ట చర్యలు చేపట్టామని పేర్కొన్నారు.