ఖైరతాబాద్ మహాగణపతి నిమజ్జనానికి ముమ్మరంగా సాగుతున్న ఏర్పాట్లు
రిపోర్టర్: శ్రీనివాస్
స్థలం: హైదరాబాద్
హైదరాబాద్ నగరంలో ప్రసిద్ధి చెందిన ఖైరతాబాద్ మహాగణపతి సాధారణ భక్తుల దర్శనాలు ముగిశాయి. నిమజ్జన ఏర్పాట్ల కోసం ఉత్సవ కమిటీ, జీహెచ్ఎంసీ అధికారులు బడా గణేశుడి వద్ద బ్యారికేడ్లను తొలగించి శోభాయాత్రకు రంగం సిద్ధం చేశారు. శుక్రవారం ఉదయం 6 గంటలకు ప్రారంభమయ్యే శోభాయాత్రను మధ్యాహ్నం 12 గంటల లోపు హుస్సేన్ సాగర్ లో విజయవంతంగా పూర్తి చేయాలని లక్ష్యంగా పెట్టుకున్నారు. భద్రత కోసం భారీగా పోలీసులను మోహరించారు.