పులివెందులలో ఎన్నికల ఉద్రిక్తత: వైఎస్ జగన్ మోహన్ రెడ్డి తీవ్ర ఆగ్రహం
రిపోర్టర్: కృష్ణ
స్థలం: Kadapa
ఆంధ్రప్రదేశ్ లోని పట్టణ స్థానిక సంస్థల ఎన్నికల పోలింగ్ సందర్భంగా పులివెందులలో తీవ్ర ఉద్రిక్తత చోటుచేసుకుంది. వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధినేత వైఎస్ జగన్ మోహన్ రెడ్డి మాట్లాడుతూ, అధికార తెలుగుదేశం పార్టీ కూటమి నాయకులు పోలీసుల సహాయంతో బూత్ లలో రిగ్గింగ్ కు పాల్పడుతున్నారని ఆరోపించారు. పోలింగ్ ఏజెంట్లను అడ్డుకోవడంపై తీవ్రంగా మండిపడ్డారు. ఈ మేరకు అక్రమాలు జరిగిన ప్రాంతాలలో తక్షణమే రీపోలింగ్ నిర్వహించాలని ఆయన డిమాండ్ చేశారు.