స్వదేశీ టెక్నాలజీకి పెద్దపీట: మూడు సరికొత్త ఏఐ మోడళ్లను ఆవిష్కరించిన కేంద్రం

రిపోర్టర్: విజయ్ స్థలం: New Delhi

దేశీయ కృత్రిమ మేధ సామర్థ్యాన్ని బలోపేతం చేసే దిశగా కేంద్ర ఎలక్ట్రానిక్స్ మరియు ఐటీ మంత్రిత్వ శాఖ ఆధ్వర్యంలోని ఇండియా-ఏఐ మిషన్ మూడు స్వదేశీ ఫౌండేషన్ ఏఐ మోడళ్లను ఆవిష్కరించినట్లు ఐటీ శాఖ కార్యదర్శి ఎస్ కృష్ణన్ వెల్లడించారు. సోకెట్ ల్యాబ్స్ మరియు జెన్టెక్యూ సంస్థలు అభివృద్ధి చేసిన ఈ మోడళ్లు రక్షణ, ప్రభుత్వ, బ్యాంకింగ్ రంగాల అవసరాలతో పాటు ఇంటర్నెట్ లేకుండా నేరుగా మొబైల్ ఫోన్లలో పనిచేయగలగడం విశేషమని అధికారులు తెలిపారు.