కర్నూలులో అత్యాధునిక మొబైల్ ఫోరెన్సిక్ వాహనాన్ని ప్రారంభించిన ఎస్పీ
రిపోర్టర్: రాము
స్థలం: కర్నూలు
కేసుల్లో శిక్షల శాతాన్ని పెంచేందుకు సాంకేతిక ఆధారాలు అత్యంత కీలకమని కర్నూలు ఎస్పీ విక్రాంత్ పాటిల్ స్పష్టం చేశారు. కర్నూలు జిల్లాలో నేర విచారణను వేగవంతం చేసే దిశగా పోలీస్ శాఖ మరో కీలక అడుగు ముందుకు వేసింది. ఇందులో భాగంగా అత్యాధునిక పరికరాలతో కూడి ఉన్న మొబైల్ ఫోరెన్సిక్ వాహనాన్ని ఆయన జెండా ఊపి ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో పలువురు పోలీసు అధికారులు, సిబ్బంది తదితరులు పాల్గొని సాంకేతికత వినియోగంపై చర్చించారు.