భారత్ జపాన్ సంయుక్త వాయుసేన విన్యాసాల్లో తేజస్ యుద్ధ విమానం ప్రయాణం

రిపోర్టర్: కిరణ్ స్థలం: జోధ్‌పుర్

భారత్‌-జపాన్‌ ద్వైపాక్షిక వాయుసేన సంయుక్త విన్యాసాలు వీర్‌ గార్డియన్‌-2026 రాజస్థాన్‌లోని జోధ్‌పుర్‌ ఎయిర్‌ఫోర్స్‌ స్టేషన్‌లో ఘనంగా జరిగాయి. ఈ విన్యాసాల్లో భాగంగా భారత్‌కు చెందిన తేలికపాటి యుద్ధవిమానం తేజస్‌లో జపాన్‌ ఎయిర్‌ సెల్ఫ్‌ డిఫెన్స్‌ ఫోర్స్‌ అధిపతి జనరల్‌ టకెహిరో మొరిటా, భారత వైమానిక దళం చీఫ్ ఎయిర్ చీఫ్ మార్షల్ అమర్ ప్రీత్ సింగ్ కలిసి ప్రయాణించారు. ఇరు దేశాల మధ్య రక్షణ సహకారంలో ఇదొక ప్రధాన మైలురాయి అని అమర్ ప్రీత్ సింగ్ అభివర్ణించారు.