పోలీసులకు మట్టి వినాయకులను పంపిణీ చేసిన హోంమంత్రి అనిత
రిపోర్టర్: హరి
స్థలం: అనకాపల్లి
పర్యావరణ పరిరక్షణలో భాగంగా వినాయక చవితి పర్వదినాన్ని పురస్కరించుకుని రాష్ట్ర హోం మంత్రి వంగలపూడి అనిత మట్టి వినాయకులను పంపిణీ చేశారు. అనకాపల్లి జిల్లా నక్కపల్లిలోని తన నివాసం వద్ద విధుల్లో ఉన్న పోలీసు సిబ్బందికి ఆమె స్వయంగా మట్టి ప్రతిమలను అందజేశారు. రసాయన విగ్రహాలకు బదులుగా మట్టి వినాయకులను ప్రతిష్ఠించి పర్యావరణాన్ని కాపాడాలని పిలుపునిచ్చారు.