ఓటీటీలో దూసుకుపోతున్న తమిళ చిత్రం మోద రాత్రి

రిపోర్టర్: రాజేష్ స్థలం: చెన్నై

తమిళంలో మంచి విజయం సాధించిన మోద రాత్రి సినిమా నెట్‌ఫ్లిక్స్ ఓటీటీ వేదికగా సెప్టెంబర్ 18 నుంచి స్ట్రీమింగ్ అవుతూ ప్రేక్షకులను విశేషంగా ఆకట్టుకుంటోంది. రాజా కరుప్పస్వామి దర్శకత్వం వహించిన ఈ చిత్రంలో రిషికాంత్, అనిష్మా జంటగా నటించగా మైత్రి మూవీ మేకర్స్ నిర్మించింది. సుమారు మూడు కోట్ల రూపాయల బడ్జెట్‌తో తెరకెక్కిన ఈ సినిమా పది కోట్ల రూపాయల వరకు వసూళ్లు సాధించింది. ఈ చిత్రాన్ని తమిళ స్టార్ హీరో ధనుష్‌తో పాటు దర్శకుడు కార్తీక్ సుబ్బరాజ్, నటుడు సింబు ప్రశంసించడం విశేషం.