కాంగ్రెస్ హామీలు అమలు చేయాలి.. ప్రజావాణిలో బీఆర్ఎస్ డిమాండ్
రిపోర్టర్: Alfa News Desk
స్థలం: కాసిపేట
మాజీ ఎమ్మెల్యే దుర్గం చిన్నయ్య ఆదేశాల మేరకు కాసిపేట మండల ఎంపీడీవో కార్యాలయంలో నిర్వహించిన ప్రజావాణిలో బీఆర్ఎస్ నాయకులు వినతిపత్రం సమర్పించారు. కాంగ్రెస్ ప్రభుత్వం ఇచ్చిన ఆరు గ్యారెంటీలు, నాలుగు వందల ఇరవై హామీలను వెంటనే అమలు చేయాలని వారు డిమాండ్ చేశారు.
ప్రజలు ఎదుర్కొంటున్న భూ సమస్యల పరిష్కారం కోసం 22-ఏ నిబంధనను వెంటనే రద్దు చేయాలని బీఆర్ఎస్ నాయకులు కోరారు. ఈ సమస్యలపై ప్రభుత్వం స్పందించి తక్షణమే చర్యలు తీసుకోవాలని వారు విజ్ఞప్తి చేశారు.