భారత్ గడ్డపై అడుగుపెట్టిన చైనా అధ్యక్షుడు షీ జిన్‌పింగ్
రిపోర్టర్: శివ
స్థలం: New Delhi
ఏడేళ్ల తర్వాత చైనా అధ్యక్షుడు షీ జిన్‌పింగ్ భారత్‌కు చేరుకున్నారు. న్యూఢిల్లీలో జరుగుతున్న 18వ బ్రిక్స్ శిఖరాగ్ర సదస్సులో పాల్గొనేందుకు ఆయన ఢిల్లీకి వచ్చారు. 2020 గల్వాన్ ఘర్షణల తర్వాత తొలిసారిగా ప్రధాని నరేంద్ర మోదీతో జిన్‌పింగ్ ఈరోజు కీలక ద్వైపాక్షిక సమావేశం నిర్వహించనున్నారు. ఈ భేటీలో సరిహద్దు పరిస్థితులు, వాణిజ్యం, వ్యూహాత్మక అంశాలపై తీవ్రంగా చర్చించే అవకాశం ఉంది.