వంటనూనెల ధరల తగ్గింపునకు కేంద్రం కీలక నిర్ణయం
రిపోర్టర్: కృష్ణ
స్థలం: న్యూఢిల్లీ
నిత్యవసర ధరల భారం నుంచి సామాన్యుడికి ఉపశమనం కలిగించేందుకు కేంద్ర ప్రభుత్వం అత్యంత కీలకమైన నిర్ణయం తీసుకుంది. దేశీయ మార్కెట్లో పెరుగుతున్న వంటనూనెల ధరలను అదుపులోకి తీసుకురావడంలో భాగంగా సన్ఫ్లవర్, సోయాబీన్, పామాయిల్లకు సంబంధించిన ముడి మరియు రిఫైన్డ్ రకాలపై ప్రాథమిక కస్టమ్స్ సుంకాన్ని కేంద్ర ఆర్థిక శాఖ భారీగా తగ్గించింది. సెప్టెంబరు 24 నుంచే ఈ సవరించిన నిబంధనలు తక్షణమే అమల్లోకి వస్తాయని స్పష్టం చేయడంతో వినియోగదారులకు పండుగ వేళ భారీ ఊరట లభించనుంది.