నిరుద్యోగులకు భారీ ఊరట: రెండు వేల పైచిలుకు ఉపాధ్యాయ పోస్టుల భర్తీకి గ్రీన్ సిగ్నల్

రిపోర్టర్: విజయ్ స్థలం: అమరావతి

ఉపాధ్యాయ ఉద్యోగాల కోసం ఎదురుచూస్తున్న అభ్యర్థులకు విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ శుభవార్త తెలిపారు. ఆంధ్రప్రదేశ్లో రెండు వేల ఏడువందల ఇరవై ఒకటి ఉపాధ్యాయ పోస్టుల భర్తీకి డీఎస్సీ షార్ట్ నోటిఫికేషన్ జారీ చేసినట్లు ఆయన వెల్లడించారు. నవంబర్ మూడో తేదీలోగా పూర్తిస్థాయి నోటిఫికేషన్ విడుదల చేయనున్నట్లు స్పష్టం చేశారు. అభ్యర్థులు ఆన్లైన్ ద్వారా దరఖాస్తు చేసుకోవాలని సూచించారు.