భక్తిపారవశ్యంతో పులకించిన బెల్లంపల్లి ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయం
రిపోర్టర్: PRASAD
స్థలం: బెల్లంపల్లి
బెల్లంపల్లి పట్టణంలోని ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో సోమవారం వినాయక చవితి వేడుకలు ఘనంగా నిర్వహించారు. పురోహితులు సతీష్ శర్మ ఆధ్వర్యంలో వేద మంత్రోచ్ఛారణల మధ్య గణనాథుడిని ప్రతిష్ఠించి ప్రత్యేక పూజలు చేశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే గడ్డం వినోద్ వెంకటస్వామి ప్రజలంతా సుఖసంతోషాలతో, ఆయురారోగ్యాలతో ఉండాలని ఆకాంక్షించారు. కార్యక్రమంలో మున్సిపల్ చైర్మన్ దావా స్వాతి రమేష్ బాబు, వైస్ చైర్మన్ రాగం శెట్టి సత్యనారాయణ, ఏఎంసీ చైర్మన్ రత్నం సుకుమారి, కాంగ్రెస్ పట్టణ అధ్యక్షుడు బండి ప్రభాకర్, నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.