విషాదం: మురుగు కాలువలో పడి యువకుడు దుర్మరణం
రిపోర్టర్: నరేష్
స్థలం: నారాయణపేట
నారాయణపేట జిల్లా ధన్వాడ మండల కేంద్రంలో విషాదకర ఘటన చోటుచేసుకుంది. ప్రమాదవశాత్తు మురుగు కాలువలో పడి లడ్డు నవీన్ అనే ఇరవై ఏడేళ్ల యువకుడు మృతి చెందినట్లు ఎస్సై కృష్ణంరాజు తెలిపారు. సెంట్రింగ్ పనులు చేస్తూ కుటుంబానికి ఆసరాగా ఉంటున్న ఒక్కగానొక్క కుమారుడు మృత్యువాత పడటంతో తల్లిదండ్రులు, కుటుంబ సభ్యులు కన్నీరుమున్నీరుగా విలపిస్తున్నారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసుకుని దర్యాప్తు జరుపుతున్నట్లు స్థానిక పోలీసులు వెల్లడించారు.