'ఉచిత కంటి వైద్య శిబిరం..': చందనాపూర్లో లయన్స్ క్లబ్ సేవలు

రిపోర్టర్: Subhan.Manthani స్థలం: మంథని

పెద్దపల్లి జిల్లా రామగిరి మండలం చందనపూర్ గ్రామంలో లయన్స్ క్లబ్ ఆధ్వర్యంలో నిర్వహించిన ఉచిత కంటి వైద్య శిబిరం విజయవంతమైంది. సర్పంచ్ కొండా మంజుల శ్రీనివాస్ కోరిక మేరకు, రేకుర్తి కంటి ఆసుపత్రి సంయుక్త ఆధ్వర్యంలో ఈ శిబిరం ఏర్పాటు చేశారు. డా. శరణ్య యాదవ్, టెక్నీషియన్ ప్రభాకర్ ఆధ్వర్యంలో 70 మందికి కంటి పరీక్షలు నిర్వహించి, 28 మందికి ఉచితంగా ఆపరేషన్లు నిమిత్తం కరీంనగర్కు తరలించారు. ఈ కార్యక్రమంలో గ్రామస్థులు లయన్స్ క్లబ్ ప్రతినిధులను ఘనంగా సన్మానించారు.