పులివెందులలో ఉద్రిక్తత: పెట్రోల్ బాంబులు, రాళ్లతో వైకాపా, తెదేపా వర్గాల ఘర్షణ

రిపోర్టర్: కిరణ్ స్థలం: Kadapa

కడప జిల్లా పులివెందుల మండలం ఎర్రిపల్లెలో ఎంపీటీసీ, జడ్పీటీసీ ఎన్నికల పోలింగ్ సమయంలో వైకాపా, తెదేపా వర్గాల మధ్య తీవ్ర ఘర్షణ చెలరేగిందని పోలీసులు తెలిపారు. పోలింగ్ కేంద్రం వద్ద ఇరువర్గాలు పరస్పరం పెట్రోల్ బాంబులు, రాళ్లతో దాడి చేసుకున్నాయని, దీంతో అక్కడ తీవ్ర భయాందోళనలు వ్యక్తమయ్యాయని వెల్లడించారు. పరిస్థితి అదుపులోకి తెచ్చేందుకు పోలీసులు రంగప్రవేశం చేసి అదనపు బలగాలను మోహరించడంతో పాటు పటిష్ట నిఘా ఏర్పాటు చేసినట్లు అధికారులు స్పష్టం చేశారు.