స్లమ్ డాగ్ సినిమాలో జరీనా వహాబ్ ఫస్ట్ లుక్ విడుదల

రిపోర్టర్: కిరణ్ స్థలం: హైదరాబాద్

తమిళ అగ్ర నటుడు విజయ్ సేతుపతి ప్రధాన పాత్రలో టాలీవుడ్ ప్రముఖ దర్శకుడు పూరీ జగన్నాథ్ తెరకెక్కిస్తున్న పాన్ ఇండియా యాక్షన్ డ్రామా స్లమ్ డాగ్ చిత్రానికి సంబంధించి మేకర్స్ తాజాగా కీలక అప్డేట్ అందించారు. ఈ సినిమాలో జుబైదా పాత్రలో నటిస్తున్న ప్రముఖ నటి జరీనా వహాబ్ ఫస్ట్ లుక్ పోస్టర్ను ఆదివారం చిత్ర యూనిట్ అధికారికంగా విడుదల చేసింది. ప్రేమతో కూడిన హృదయం పోరాటాలతో నిండిన జీవితం అంటూ ఈ పోస్టర్పై పొందుపరిచిన ప్రత్యేక క్యాప్షన్ ప్రేక్షకుల్లో సినిమాపై భారీ అంచనాలను పెంచుతోంది.