'భద్రతా బలగాల ఎదురుకాల్పుల్లో ఇద్దరు ఉగ్రవాదులు హతం': జమ్మూకశ్మీర్‌లో ఎన్‌కౌంటర్

రిపోర్టర్: అశోక్ స్థలం: జమ్మూకశ్మీర్

జమ్మూకశ్మీర్‌లోని ఉధంపుర్ జిల్లా మజల్టా పరిధిలోని బ్రాటెల్ సోన్, ఖుబ్బన్ అటవీప్రాంతంలో భద్రతా బలగాలకు, ఉగ్రవాదులకు మధ్య భీకర ఎన్‌కౌంటర్ కొనసాగుతోంది. ఉగ్రవాదులు సంచరిస్తున్నారనే పక్కా సమాచారంతో సైన్యం, పోలీసులు, సీఆర్‌పీఎఫ్ సంయుక్తంగా చేపట్టిన ఈ ఆపరేషన్‌లో ఇప్పటివరకు ఇద్దరు ఉగ్రవాదులు హతమయ్యారు. బలగాల వలయాన్ని తప్పించుకునేందుకు ఉగ్రవాదులు జరిపిన కాల్పులకు సైన్యం గట్టిగా బదులిస్తోంది. అటవీప్రాంతాన్ని నలువైపులా దిగ్బంధించిన భద్రతా బలగాలు అదనపు బలగాలతో ముమ్మరంగా గాలింపు చర్యలు చేపట్టి ఉగ్రవాట్ల ఏరివేతను కొనసాగిస్తున్నాయి.