విద్యార్థులకు అలర్ట్: సీబీఎస్ఈ పదో తరగతి ఎల్ఓసీ సవరణలకు అవకాశం
రిపోర్టర్: భాస్కర్
స్థలం: న్యూఢిల్లీ
సీబీఎస్ఈ పరిధిలోని పదో తరగతి మరియు పన్నెండో తరగతి విద్యార్థుల వివరాల సవరణకు బోర్డు అవకాశం కల్పించినట్లు అధికారులు వెల్లడించారు. ఈనెల రెండు నుంచి ఏడో తేదీ వరకు ఎల్ఓసీ దరఖాస్తుల్ లో తప్పులను సరిదిద్దుకోవచ్చని స్పష్టం చేశారు. విద్యార్థుల పేర్లు, తల్లిదండ్రుల వివరాలు, పుట్టిన తేదీ వంటి అంశాలను పరిశీలించి తక్షణమే పాఠశాలల ద్వారా సరిదిద్దుకోవాలని అధికారులు సూచించారు.