ఖాళీ కుర్చీల నడుమ నలిగిపోతున్న ఆదోని మండల ప్రజల ఆశలు

రిపోర్టర్: KISHORE M స్థలం: ఆదోని

కర్నూలు జిల్లా ఆదోని మండల కేంద్రంలోని పంచాయతీరాజ్ ఇంజినీరింగ్ సెక్షన్ కార్యాలయంలో అధికారులు అందుబాటులో ఉండడం లేదని ప్రజలు తీవ్రంగా ఆరోపిస్తున్నారు. వివిధ గ్రామాల నుంచి సొంత పనుల నిమిత్తం కార్యాలయానికి వచ్చే ప్రజలు మరియు కాంట్రాక్టర్లు సంబంధిత అధికారుల కోసం గంటల తరబడి నిరీక్షించాల్సి వస్తోంది. అధికారుల బాధ్యతారాహిత్యంతో ప్రభుత్వ అభివృద్ధి పనులు ఆలస్యమవుతున్నాయని స్థానికులు వాపోతున్నారు. ఇప్పటికైనా ఉన్నతాధికారులు తక్షణమే స్పందించి, ఆదోని పంచాయతీరాజ్ కార్యాలయంలో అధికారులు ఎల్లప్పుడూ ప్రజలకు అందుబాటులో ఉండేలా కఠిన చర్యలు తీసుకోవాలని వారు కోరుతున్నారు.