భారత్-చైనా వివాదం: వేయిట్ లిఫ్టర్ చారు పెసికి చైనా వీసా తిరస్కరణ

రిపోర్టర్: ప్రవీణ్ స్థలం: New Delhi

అరుణాచల్ ప్రదేశ్కు చెందిన ప్రముఖ వెయిట్లిఫ్టర్ చారు పెసికి చైనా ప్రభుత్వం స్టెపిల్డ్ వీసా జారీ చేయాలని నిర్ణయించడం తీవ్ర కలకలం రేపింది. ఈ నేపథ్యంలో భారత వెయిట్లిఫ్టింగ్ ఫెడరేషన్ కీలక నిర్ణయం తీసుకున్నట్లు అధికారులు తెలిపారు. చైనా అనుసరిస్తున్న ఈ వివాదాస్పద విధానాన్ని కేంద్ర ప్రభుత్వం ఎట్టిపరిస్థితుల్లోనూ అంగీకరించబోదని స్పష్టం చేయడంతో, ఆ అథ్లెట్ను త్వరలో జరగనున్న ప్రపంచ ఛాంపియన్షిప్ పోటీల నుంచి పూర్తిగా వెనక్కి పిలిపించినట్లు ఫెడరేషన్ వర్గాలు వెల్లడించాయి.