బీసీ కుల గణన కోసం కదం తొక్కిన నాయకులు
రిపోర్టర్: R.RAVINDER
స్థలం: మంచిర్యాల
మంచిర్యాలలోని పూలే భవన్ లో బహుజన లెఫ్ట్ ప్రంట్ ఆధ్వర్యంలో ఆదివారం రౌండ్ టేబుల్ సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా నాయకులు మాట్లాడుతూ కేంద్ర ప్రభుత్వం చేపట్టే జనగణనలో బీసీ కులగణనను చేర్చాలని డిమాండ్ చేశారు. అలాగే రాష్ట్ర ప్రభుత్వం ఎన్నికల హామీలను వెంటనే అమలు చేయాలని, లేనిపక్షంలో దశలవారీగా ప్రజా ఆందోళనలు ఉధృతం చేస్తామని హెచ్చరించారు.