డిసెంబర్ 12, 13 తేదీల్లో సీటెట్ పరీక్షల నిర్వహణ
రిపోర్టర్: ప్రవీణ్
స్థలం: India
కేంద్ర మాధ్యమిక విద్యా మండలి సీటెట్ 22వ విడత పరీక్షల షెడ్యూల్ విడుదల చేసింది. డిసెంబర్ 12 మరియు 13 తేదీల్లో ఆఫ్‌లైన్ విధానంలో ఈ పరీక్షలు జరగనున్నాయి. పరీక్షా కేంద్రాల వివరాలను పరీక్షకు 15 రోజుల ముందు పోర్టల్‌లో అందుబాటులో ఉంచనున్నారు. అర్హత సాధించడానికి అభ్యర్థులు కనీసం 90 మార్కులు పొందాలి.