నేషనల్ జియోగ్రాఫిక్ అవార్డుకు ఎంపికైన అస్సాం పర్యావరణవేత్త పూర్ణిమ దేవి
రిపోర్టర్: వెంకట్
స్థలం: అస్సాం
అస్సాంకు చెందిన ప్రముఖ పర్యావరణవేత్త డాక్టర్ పూర్ణిమ దేవి బర్మన్ ప్రతిష్టాత్మక 'నేషనల్ జియోగ్రాఫిక్ వేఫైండర్ అవార్డు-2026'కు ఎంపికయ్యారు. అంతరించిపోతున్న 'హర్గిలా' (గ్రేటర్ అడ్జుటెంట్) కొంగల సంరక్షణ కోసం ఆమె ఏర్పాటు చేసిన 'హర్గిలా ఆర్మీ' ద్వారా మహిళలను ఏకం చేసి అద్భుతమైన కృషి చేస్తున్నారు. స్థానిక ప్రజల భాగస్వామ్యంతో పర్యావరణ పరిరక్షణలో ఆమె సాధిస్తున్న విజయాలు ప్రపంచవ్యాప్తంగా గుర్తింపు పొందుతున్నాయి.