ఇట్లు అర్జున సినిమాకు నాగార్జున సమర్పణ: అక్టోబర్ 30న థియేటర్లలో గ్రాండ్ రిలీజ్

రిపోర్టర్: రాము స్థలం: హైదరాబాద్

కొత్త టాలెంట్ను ప్రోత్సహించడంలో ఎప్పుడూ ముందుంటామని కింగ్ నాగార్జున స్పష్టం చేశారు. అనీష్ హీరోగా మహేష్ ఉప్పల దర్శకత్వంలో తెరకెక్కిన ఇట్లు అర్జున చిత్రానికి ఆయన సమర్పకుడిగా వ్యవహరిస్తున్నారు. ఈ సందర్భంగా నిర్వహించిన ప్రెస్ మీట్లో మాట్లాడుతూ, సినిమాలోని బ్రిలియంట్ స్క్రీన్ప్లే, అనీష్ నటన తనను ఎంతగానో ఆకట్టుకున్నాయని వెల్లడించారు. వాట్ నెక్స్ట్ ఎంటర్టైన్మెంట్స్ బ్యానర్పై వస్తున్న ఈ చిత్రం అక్టోబర్ 30న ప్రేక్షకుల ముందుకు రానుందని మేకర్స్ తెలిపారు.