ఓటమి భయంతో కూటమి నేతలు కుట్రలు చేస్తున్నారంటూ చింతకాయల అనిత ఆగ్రహం
రిపోర్టర్: రుత్తల నాగేశ్వరరావు
స్థలం: నర్సీపట్నం
అనకాపల్లి జిల్లా నర్సీపట్నం మున్సిపాలిటీలో చైర్పర్సన్ అభ్యర్థిగా పోటీ చేస్తున్న చింతకాయల అనిత మాట్లాడుతూ ఓటమి భయంతో కూటమి నాయకులు ముసలి కన్నీరు కారుస్తూ కుట్రలు చేస్తున్నారని తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు. తమ పరిస్థితి బాగోలేదని హేళన చేస్తూ అక్రమ కేసులు బనాయించారని మండిపడ్డారు. ఈ ఎన్నికల్లో ప్రజలందరూ ఏనుగు గుర్తుపై ఓటు వేసి తగిన బుద్ధి చెప్పాలని ఆమె పిలుపునిచ్చారు.