తెర్లాంలో వైకాపాకు భారీ షాక్: సర్పంచులు, ఎంపీటీసీల రాజీనామా
రిపోర్టర్: కిరణ్
స్థలం: విజయనగరం
విజయనగరం జిల్లా తెర్లాం మండలంలో వైకాపాకు భారీ ఎదురుదెబ్బ తగిలింది. గురువారం పలువురు నాయకులు ఆ పార్టీకి రాజీనామా చేశారు. ఏడు పంచాయతీలకు చెందిన ఐదుగురు మాజీ సర్పంచులు, ఇద్దరు మాజీ ఎంపీటీసీ సభ్యులతో పాటు పలువురు కార్యకర్తలు తెలుగుదేశం పార్టీలో చేరుతున్నట్లు ప్రకటించారు. చిన్న శ్రీను బాటలో నడుస్తామని వారంతా స్పష్టం చేసినట్లు స్థానిక వర్గాలు వెల్లడించాయి.