మహమ్మదాబాద్లో కడెం కాలువ నీటి మళ్లింపుపై ఆగ్రహం వ్యక్తం చేసిన రైతులు
రిపోర్టర్: Gangadhar Reporter
స్థలం: జన్నారం
మంచిర్యాల జిల్లా జన్నారం మండలంలోని మహమ్మదాబాద్ సమీపంలో కడెం ప్రాజెక్టు కాలువ నీటిని అడవిలోకి వదులుతున్నామని రైతులు లక్ష్మణ్, మల్లేష్, రమేష్ ఆరోపించారు. కాలువకు అడ్డంగా కట్ట కట్టి నీటిని మళ్లించడంతో చివరి ఆయకట్టుకు నీరు చేరడం లేదన్నారు. నీరు వృధా అవుతుండడంతో పాటు వరి పంటలు ఎండిపోతున్నాయని ఆవేదన వ్యక్తం చేశారు. అధికారులు స్పందించి నీటిని సక్రమంగా పొలాలకు అందించాలని కోరారు.