గణేష్ శోభాయాత్రకు పటిష్ట బందోబస్తు ఏర్పాటు చేశామన్న ఎస్పీ వినీత్

రిపోర్టర్: సురేష్ స్థలం: నారాయణపేట

నారాయణపేట మెయిన్ చౌక్లో విశ్వహిందూ పరిషత్ మరియు గణేష్ ఉత్సవ సమితి ఆధ్వర్యంలో నిర్వహించిన ప్రత్యేక పూజా కార్యక్రమంలో జిల్లా ఎస్పీ డాక్టర్ వినీత్ పాల్గొన్నారు. గణేష్ శోభాయాత్ర, నిమజ్జనం ప్రశాంతంగా జరిగేలా పటిష్ట భద్రతా ఏర్పాట్లు చేశామని ఆయన తెలిపారు. ఈ వేడుకలు ప్రశాంత వాతావరణంలో విజయవంతం అయ్యేలా ప్రజలందరూ పోలీస్ శాఖకు పూర్తి సహకారం అందించాలని ఎస్పీ కోరారు.