రెండు భాగాలుగా అల్లు అర్జున్ రాకా సినిమా విడుదల

రిపోర్టర్: ప్రవీణ్ స్థలం: Hyderabad

ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ మరియు స్టార్ డైరెక్టర్ అట్లీ కాంబినేషన్లో తెరకెక్కుతున్న మోస్ట్ అవైటెడ్ ప్రాజెక్ట్ రాకా సినిమాను రెండు భాగాలుగా విడుదల చేయాలని మేకర్స్ ఆలోచిస్తున్నట్లు ఫిలిం నగర్ వర్గాల్లో జోరుగా ప్రచారం సాగుతోంది. ఈ చిత్రానికి సంబంధించిన కథా పరిధి చాలా పెద్దదిగా ఉండటంతో పాటు విభిన్న ప్రపంచాలు, టైమ్ లైన్స్తో కూడిన విజువల్స్ ఉన్నాయని, అందుకే ఈ నిర్ణయం తీసుకునే అవకాశం ఉందని సినీ వర్గాలు వెల్లడించాయి.