సోమిరెడ్డి సమక్షంలో వైఎస్సార్సీపీని వీడి టీడీపీలో చేరిన పందొమ్మిది కుటుంబాలు
రిపోర్టర్: Alfa News Desk
స్థలం: నెల్లూరు రూరల్
నెల్లూరు జిల్లా మనుబోలు మండలం జట్లకొండూరు గ్రామానికి చెందిన మరో పందొమ్మిది కుటుంబాలు వైఎస్సార్సీపీని వీడి తెలుగుదేశం పార్టీలో చేరాయి. నెల్లూరు వేదాయపాళెం కార్యాలయంలో సర్వేపల్లి శాసనసభ్యులు సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి వారికి కండువాలు కప్పి పార్టీలోకి సాదరంగా ఆహ్వానించారు. కూటమి ప్రభుత్వ పాలనలో జరుగుతున్న అభివృద్ధిని చూసి ప్రజలు స్వచ్ఛందంగా మద్దతు తెలుపుతున్నారని ఆయన ఈ సందర్భంగా పేర్కొన్నారు.